NTV Telugu Site icon

CMR College: సీఎంఆర్ కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం.. గొడవ పడుతున్న విద్యార్థి సంఘాల నేతలు

Cmr College

Cmr College

CMR College: హైదరాబాద్‌లోని CMR కాలేజ్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని వచ్చిన NSUI (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) విద్యార్థి సంఘ నాయకులు, కాలేజ్ యాజమాన్యంతో గొడవకు దిగారు. గర్ల్స్ హాస్టల్ లోపలికి అనుమతి లేకుండా ఎలా వెళ్ళారని సిబ్బంది ప్రశ్నించడంతో విద్యార్థి సంఘాల నాయకులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. నిన్నటి సంఘటనతో గర్ల్స్ హాస్టల్ లో భయాందోళనకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

Also Read: Police Constable: కుటుంబ గొడవల కారణంగా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ఈ సంఘటనను గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. వివిధ జిల్లాల నుండి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. లక్షల రూపాయల ఫీజు చెల్లించి మా పిల్లలను హాస్టల్ లో చేర్పించాము, కానీ ఇప్పుడు వారికి రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనితో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంకా కాలేజ్ యాజమాన్యానికి మధ్య చర్చలకు కారణం అయ్యింది.

Also Read: CMR Engineering College: సర్దుమణిగిన గర్ల్స్ హాస్టల్‌ వివాదం.. యాజమాన్యం ముందు స్టూడెంట్స్ డిమాండ్లు

Show comments