ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడున్న ఆలయంలో ఓ వ్యక్తి పోర్న్ చూస్తూ హస్తప్రయోగం చేస్తూ కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్‌నగర్‌లో జరిగింది. వైరల్ వీడియోలో.. ఒక యువకుడు ఒక గుడిలో నేలపై పడుకుని ఉన్నాడు. మరో వ్యక్తి కూడా అక్కడ ఆవరణలో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో.. ఓ వ్యక్తి మొబైల్ లో పోర్న్ చూస్తూ హస్తప్రయోగం చేసుకుంటున్నట్లు కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే.. దైవ మందిరంలో ఇలాంటి ఘటనలకు పాల్పడటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తీవ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: China: గుడిలో హుండీకి క్యూఆర్ కోడ్.. లక్షల్లో నొక్కేసిన ఓ వ్యక్తి
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో రెండు రోజుల క్రితందని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అనైతిక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థల కార్యకర్తలు డిమాండ్ చేశారు. నిందితుడు ఆలయంలో ఇలాంటి నీచమైన పని చేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని హిందుత్వ నేతలు అంటున్నారు. మరోవైపు.. సోషల్ మీడియాలో ప్రజలు ఈ సంఘటనపై మండిపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేసును విచారిస్తామని పోలీసులు తెలిపారు.
Read Also: Mamata Banerjee: కోల్‌కతా హాస్పిటల్ దాడి బీజేపీ, లెఫ్ట్ పార్టీల పనే..
