China: గుడిలో హుండీకి క్యూఆర్ కోడ్.. లక్షల్లో నొక్కేసిన ఓ వ్యక్తి
- డబ్బుల కోసం మోసగాళ్లు సరికొత్త ఆలోచనలతో చోరీ
- దేవుళ్లను కూడా వదలని దొంగలు
- గుడిలో ఉండే హుండీకి క్యూఆర్ కోడ్
- క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 3 లక్షలకు పైగా చోరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బుల కోసం మోసగాళ్లు సరికొత్త ఆలోచనలతో చోరీ చేస్తున్నారు. జనాలను మోసం చేయడమే కాకుండా.. ఇప్పుడు దేవుడు మీద కూడా పడ్డారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఓ వ్యక్తి గుడిలో ఉండే హుండీకి తన ఖాతాకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ను పెట్టాడు. దీంతో.. ఆ గుడికి వచ్చే భక్తులంతా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి కానులకు వేసేశారు. ఏకంగా క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 3 లక్షలకు పైగా వచ్చాయి. అయితే.. ఈ ఘరానా దొంగ లా గ్రాడ్యుయేట్ చేశాడు. ఈ వ్యవహారం చైనాలోని బౌద్ధ ఆలయంలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ యొక్క నివేదిక ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో.. చర్యలు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ గుడికి వచ్చే భక్తులు.. హుండీలో డబ్బులు వేయాల్సింది పోయి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే వారన్నారు. దీంతో అతని ఖాతాలో నగదు బదిలీ అయ్యేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షాంగ్సీ పోలీసులు విడుదల చేశారు. అయితే.. ఈ వీడియో ఫుటేజీ బయటపడకుండా ఉంటే ఇలానే కొనసాగుతూ ఉండేది.
Read Also: IPS Transfers in AP: ఏపీలో 10 మంది ఐపీఎస్‌ల బదిలీలు..
కాగా.. ఆ వ్యక్తి యొక్క వివరాలను పోలీసులు తెలుపలేదు. ఈ ఏడాది అతను వాయువ్య షాంగ్సీ ప్రావిన్స్, నైరుతి సిచువాన్, చాంగ్‌కింగ్ ప్రావిన్స్‌లలోని బౌద్ధ దేవాలయాల్లో ఈ మోసానికి పాల్పడ్డానని, దాదాపు 4,200 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 3.5 లక్షలు) దొంగిలించానని అతడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కాగా.. నిందితుడు ఇప్పటివరకు దోచుకున్న డబ్బు మొత్తాన్ని తిరిగి ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ.. ఈ సంఘటన చైనాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో ఇప్పుడు మోసం చేసేందుకు దేవుడి గుడిని కూడా వదలడం లేదని ప్రజలు అంటున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!