Site icon NTV Telugu

Telusu Kada: ‘తెలుసు కదా’ ముగించేసిన సిద్దు

Telusu Kada Movie

Telusu Kada Movie

Telusu Kada: మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. దర్శకురాలిగా మారిన ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. టీం లోకేషన్ లో కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు.

READ ALSO: Kishan Reddy: జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్.. స్వయం సమృద్ధికి క్రిటికల్ మినరల్స్ కీలకం!

ఇటివలే రిలీజ్ చేసిన తెలుసు కదా టీజర్ కు ట్రెంమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సాంగ్ మల్లిక గంధ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలో సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది. మేకర్స్ ఈ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేయబోతున్నారు. డైరెక్టర్ నీరజకోన చాలా యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారని టీం చెబుతోంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని టీం చెబుతోంది. ఇక సెన్సేషనల్ కంపోజర్ తమన్ మ్యూజిక్ అందించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ VS లావిష్ విజువల్స్‌ను అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. కాస్ట్యూమ్స్‌ శీతల్ శర్మ. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది.

READ ALSO: North Korea: కిమ్ కోపానికి కరిగిపోయిన ఐస్ క్రీం.. దెబ్బకు పేరు మారిపోయింది…

Exit mobile version