Telugu Titans: బాలకృష్ణను కలిసిన తెలుగు టైటాన్స్ ప్లేయర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణను తెలుగు టైటాన్స్ ప్లేయర్స్ కలిశారు. ప్రో కబడ్డీ లీగ్ కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఫూణే, నోయిడా, ముంబై, జైపూర్, పాట్నాతో పాటు మరికొన్ని నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే, రేపటి (జనవరి 19) నుంచి హైదరాబాద్ లో తెలుగు టైటాన్స్ కు చెందిన మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం వేదికగా శుక్రవారం జరుగున్న మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో మన తెలుగు టైటాన్స్ తలపడబోతుంది. ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల ముందుగానే తెలుగు టైటాన్స్ ప్లేయర్స్ హైదరాబాద్ కు వచ్చారు.
Read Also: Karumuri Nageswara Rao: వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు.. ఇలా స్పందించిన మంత్రి కారుమూరి
Also Read
- Gold and Silver Prices: వరుస పతనానికి బ్రేక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
- Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల దాడి.. చమురు శుద్ధి కర్మాగారమే టార్గెట్..!
- Bisleri Water: మీరు తాగే బిస్లరీ వాటర్ సురక్షితమేనా? షాకింగ్ విషయాలు వెల్లడించిన FSSAI..
- Koti Deepotsavam 2026: గరికిపాటి ప్రవచనం, ఏకామ్రేశ్వరస్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
కాగా, తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ లో హోమ్ మ్యాచ్‌లను గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మునుపెన్నడూ లేనంత భారీ ఎత్తున జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన టిక్కెట్లు www.bookmyshow.comలో అందుబాటులో ఉన్నాయి. తెలుగు టైటాన్స్ తమ హోమ్ మ్యాచ్‌లను రేపటి నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లో ఆడనుంది. ఈ సందర్భంగా తెలుగు టైటాన్స్ సీఈఓ, త్రినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ లీగ్ పోటీతో పాటు గేమ్‌ప్లే, ఆటగాళ్ల ప్రదర్శనల పరంగా జట్టు విజయం సాధిస్తుందని తెలిపారు. ప్రో కబడ్డీ లీగ్ యొక్క ప్రస్తుత సీజన్, చాలా గట్టి పోటీతో కూడిన కొన్ని మ్యాచ్‌లకు సాక్షిగా నిలిచింది. తెలుగు టైటాన్స్‌లో కెప్టెన్ పవన్ సెహ్రావత్ తో పాటు సందీప్ ధుల్, పర్వేష్ వంటి దిగ్గజాలు తమ ఆటను పునర్ నిర్మించుకోవడంతో పాటుగా కొత్త ఆటగాళ్లు కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారని చెప్పారు.
Read Also: Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు ఇచ్చిన మాట సీఎం నిలబెట్టుకోవాలి: పిల్లి సుధాకర్
ఇక, హోమ్ లీగ్ గురించి శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. “మేము లీగ్ ముగింపుకు ముందు హోమ్ గ్రౌండ్ లోకి ప్రవేశించాము.. కాబట్టి మనం మెరుగైన ప్రదర్శన చేయడం ముఖ్యం అని తెలిపారు. ఈ మ్యాచ్ ల కోసం హైదరాబాద్‌లోని అభిమానుల తెలుగు టైటాన్స్ కు సపోర్ట్ ఇస్తారని మేము కోరుతున్నామని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ మద్దతే ప్రో కబడ్డీ లీగ్ 2024ని దేశంలో అత్యధికంగా అనుసరించే స్పోర్ట్స్ లీగ్‌లలో ఒకటిగా మార్చింది” అని అన్నారు. దీన్ని ఒకచోట చేర్చడంలో మాకు సహాయం చేసిన మా భాగస్వాములందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. మాతో భాగస్వామ్యం కొనసాగించినందుకు గ్రీన్కోకు ప్రత్యేక ధన్యవాదాలని శ్రీ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Cholera Outbreak: జాంబియాలో కలరాతో 400 మందికి పైగా మృతి.. 10,000 మందికి ఇన్ఫెక్షన్..
అయితే, తెలుగు టైటాన్స్ తమ మొదటి హోమ్ మ్యాచ్‌ను రేపు బెంగళూరు బుల్స్‌తో ఆడుతుంది. అభిమానులు ప్రతి మ్యాచ్‌ని లైవ్‌లో రాత్రి 7:30 గంటలకు ఎఫ్‌టీఏ (FTA) ఛానెల్, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్-2, స్టార్ స్పోర్ట్స్ 2HD – ఇంగ్లీష్, స్టార్ స్పోర్ట్స్-1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, కన్నడలో స్టార్ సువర్ణ ప్లస్‌లో, తెలుగులో స్టార్ మా గోల్డ్ తో పాటు హాట్‌స్టార్ తో సహా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు. మరిన్ని వివరాల కోసం దయచేసి కళ్యాణ్ చక్రవర్తి @ 9381340098 సంప్రదించండి.
తాజావార్తలు
-
IND vs NZ: డ్రాగా ముగిసిన తొలి టెస్టు.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ!
-
Gold and Silver Prices: వరుస పతనానికి బ్రేక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
-
Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల దాడి.. చమురు శుద్ధి కర్మాగారమే టార్గెట్..!
-
Sharwanand-Bhogi: ఒత్తిడి, భయం లేవు.. అందర్నీ సంతృప్తిపరుస్తా.. ‘భోగి’పై శర్వా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bisleri Water: మీరు తాగే బిస్లరీ వాటర్ సురక్షితమేనా? షాకింగ్ విషయాలు వెల్లడించిన FSSAI..
ట్రెండింగ్
-
INDA vs PAKA: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!