NTV Telugu Site icon

PKL: హమ్మయ్య… గెలిచారు… తెలుగు టైటాన్స్ విజయం

Pkl

Pkl

ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-పాట్నా పైరేట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ గెలుపొందింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 28-26 పాయింట్ల స్వల్ప తేడాతో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది.

Read Also: Nitish Kumar: ఎన్డీయేలోనే ఉంటా.. క్లారిటీ ఇచ్చిన నితీష్ కుమార్..

తెలుగు టైటాన్స్ జట్టులో అత్యధికంగా ఆశిశ్ నర్వాల్ 9 పాయింట్లు సాధించాడు. అతనికి తోడు పవన్ సెహ్రావత్ 5, అంకిత్ 4, విజయ్ మాలిక్ 3 పాయింట్లతో రాణించారు. పాట్నా జట్టులో దేవాంక్ 7 పాయింట్లు, అయాన్ 6, సందీప్ కుమార్, అంకిత్ జగ్లాన్ 3 పాయింట్లు చేశారు. మొదటి నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడుకుంటూ వచ్చాయి. ఈ ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ గెలుపొందింది. ఇరు జట్లు ఆల్ రౌండ్ ప్రదర్శనతో రాణించాయి. తెలుగు టైటాన్స్‌లో ట్యాకిల్ పాయింట్స్ 2 ఎక్కువగా ఉన్నాయి. దీంతో.. తెలుగు టైటాన్స్ గెలిచి రెండో గెలుపును నమోదు చేసింది.

Read Also: Black Lips : మీ పెదవులు నల్లగా మారాయా? ఈ చిట్కాలు పాటించండి..

Show comments