పలు కారణాల వల్ల పెదవులు నల్లగా మారుతుంటాయి. పెదవులు గులాబీ రంగులో మారాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.. 

మగవారి పెదవులు నల్లబడటం వెనుక కారణం పొగతాగడం ప్రధాన కారణం.

గులాబి రంగులోకి మారేందుకు ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. 

 టమోటాలు, క్యారెట్లు, ఆకుకూరలు వంటి పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి.  

 చక్కెర గింజల్లో కొద్దిగా గ్లిజరిన్ మిక్స్ చేసి పెదాలను స్క్రబ్ చేయండి. ఇలా ఒకటి నుంచి 2 నిమిషాల పాటు చేస్తూ 5 నిమిషాల తర్వాత కడిగేయండి. 

 ఇలా వారం రోజుల పాటు ప్రతిరోజూ చేయడం వల్ల మీ పెదాలు మృదువుగా, మెరుస్తూ ఉంటాయి.

 బీట్‌రూట్‌లో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల మీ పెదాలను అందంగా మార్చడమే కాకుండా వాటిని మృదువుగా మారుస్తాయి. 

అర చెంచా బీట్‌రూట్ రసం, ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా అలోవెరా జెల్ కలిపి లిప్ మాస్క్‌ను తయారు చేయండి. రాత్రి పడుకునే ముందు దీన్ని పెదవులపై అప్లై చేయండి.