భారత్‌లో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలకు గురిచేస్తున్న మంకీపాక్స్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అతడి నమూనాలను పరీక్షల కోసం పంపించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రోగిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
READ MORE: Mangalya Shopping Mall: సంయుక్త మీనన్ చేతుల మీదుగా మాంగళ్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్..
భారత్‌లో సెప్టెంబర్ 9న తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళ ప్రభుత్వం 18 తేదీన ఈ విషయాన్ని ధృవీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి ఇటీవల తిరిగి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి యూఏఈ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాజిటివ్‌గా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ క్రమంలో.. వ్యాధికి సంబంధించిన ఏవైనా లక్షణాలను వారు గమనించినట్లయితే చికిత్స పొందాలని, ఆరోగ్య విభాగానికి తెలియజేయాలని జార్జ్ ప్రజలను కోరారు. ఎంపాక్స్ పేషెంట్‌ను ఐసోలేట్ చేసి మెడికల్ ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తున్నామని ఆరోగ్య మంత్రి జార్జ్ తెలిపారు.
READ MORE: Harsha Sai Audio Leak: హర్ష కృష్ణుడి లాంటి కళ్లు నీవి.. యువతి మాట్లాడుతున్న ఆడియో లీక్
మంకీపాక్స్ లక్షణాలు..
మంకీపాక్స్ అనేది మశూచి లాంటి వ్యాధి. ఈ వ్యాధి సోకితే జ్వరం, చలి, శరీరంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత శరీరంలో ఎరుపు దద్దుర్లు మొదలవుతాయి. కొద్ది రోజుల్లోనే వాటి నుంచి చీము బయటకు వస్తుంది. ఆఫ్రికాలోని 54 దేశాల్లో 12 దేశాల్లో మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కాగా.. కాంగోలో ఈ ఏడాది అత్యధిక కేసులు నమోదు కావడం గమనార్హం. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ఆఫ్రికా CDC) 2024లో మొత్తం 18,910 పైగా కేసులలో 94 శాతం లేదా 17,794 ఒక్క కాంగోలోనే నమోదయ్యాయని నివేదించింది. ప్రభుత్వం ప్రకారం.. ఈ సంవత్సరం ఈ వ్యాధి కారణంగా 541 మంది మరణించారు. అందులో 535 మరణాలు కాంగోలోనే సంభవించాయి.