Site icon NTV Telugu

TV Actress Vahini : క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రముఖ నటి వాహిని మృతి..

Vahini

Vahini

తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వాహిని (అలియాస్ పద్మక్క) బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వయసు కేవలం 48 ఏళ్లు మాత్రమే. విజయనగరంలో జన్మించిన వాహిని, తెలుగు.. తమిళ చిత్ర పరిశ్రమల్లో సహాయ నటిగా పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా నరేష్, విజయకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో ఆమె కథానాయికగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వెండితెర కంటే బుల్లితెరపైనే ఆమెకు ఎక్కువ క్రేజ్ ఉంది. అనేక ప్రజాదరణ పొందిన సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆమె అకాల మరణం టాలీవుడ్‌కు పెద్ద లోటు అని సహనటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version