Weather Updates : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈరోజు ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్ వరకు విస్తరించనున్నట్లు పేర్కొంది. నైరుతి రుతుపవనాల విస్తరణ నేప+థ్యంలో మూడ్రోజుల పాటు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో… ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలలో వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
ఇదిలా ఉంటే.. సోమవారం కాప్రా, ఘట్కేసర్, చర్లపల్లి, పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఘట్కేసర్లో రికార్డు స్థాయిలో 90.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సోమవారం సాయంత్రం కొద్ది గంటల వ్యవధిలో కాప్రాలో 60.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాప్రా, చెర్లపల్లి పరిధిలోని దమ్మాయిగూడ, నాగారం, ఈసీఐఎల్, జవహర్ నగర్, బొల్లారం, అల్వాల్, మౌలా అలీ తదితర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అయితే, విచిత్రమేమిటంటే, RK పురం, త్రిముల్ఘేరి, సఫిల్గూడ, మల్కాజ్గిరి వంటి అనేక సమీప ప్రాంతాలలో తేలికపాటి జల్లులు మాత్రమే నమోదయ్యాయి.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!