Site icon NTV Telugu

Telangana Temperature: తెలంగాణలో పెరుగుతున్న ఎండలు.. హైదరాబాద్‌లో 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు!

Temperature

Temperature

Temperatures increasing in Telangana: మొన్నటివరకు వణికించిన చలి.. ఇటీవలి రోజుల్లో తగ్గుముఖం పట్టింది. తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా దాదాపుగా అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. 5 రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా.. 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటోంది. మరోవైపు హైదరాబాద్‌లో 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

మహబూబ్‌నగర్‌, మెదక్‌, భద్రాచలం, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత పెరిగింది. గాలిలో తేమ శాతం తగ్గిపోతుండటమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు ఆరంభం అయ్యాయి. ఆదిలాబాద్‌, రామగుండంలలో సాధారణం 14 డిగ్రీల కన్నా 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రానున్న రోజులో రాష్ట్రంలో ఎండలు పెరిగే అవకాశం ఉంది.

Also Read: Gold Price Today : మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?

కోస్తా, ఉత్తరాంధ్రలో కూడా ఎండలు పెరుగుతున్నాయి. ఏపీలో రాత్రివేళ సాధారణ 21 డిగ్రీల సెల్సియస్ ఉంది. పగటివేళ అత్యధికంగా 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 12 నుంచి 27 కిలోమీటర్లుగా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోకి గాలి వేగం సాధారణంగానే ఉంది.

 

 

Exit mobile version