Telangana Weather Alert: ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-50 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
Also Read: Horoscope Today: గురువారం దినఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ఈరోజు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం (ఆగష్టు 8) యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, నారాయణపేట, గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. శనివారం (ఆగష్టు 9) కుమురం భీం, నిజామాబాద్, నిర్మల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.