Site icon NTV Telugu

Rail Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

Visakharain

Visakharain

Rail Alert :  తెలంగాణ రాష్ట్రంలో రాగల కొద్ది గంటల్లో వాతావరణం పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (ప్రస్తుత హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలు), మెదక్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా, ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈదురు గాలుల కారణంగా చెట్లు విరిగిపడే ప్రమాదం, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Riyan Parag: వరుసగా ఆరు సిక్స్‌లు బాదిన రియాన్ పరాగ్.. వీడియో వైరల్!

మరికొన్ని జిల్లాలైన మెదక్, సిద్ధిపేట, సిరిసిల్ల, కామారెడ్డిలో వాతావరణం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా, ఈ ప్రాంతాల్లో రాళ్ల వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. రాళ్ల వర్షం పంటలకు , ఆస్తికి నష్టం కలిగించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉంటుండగా, సాయంత్రం నుండి అనేక జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురుస్తున్నాయి. పిడుగులు పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా బలమైన గాలులు , ఉరుములతో కూడిన వర్షం సమయంలో సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచిస్తున్నారు. చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. రాళ్ల వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

Mangoes: ఇలాంటి మామిడి పండ్లు తింటున్నారా? మీకు క్యాన్సర్ ముప్పు తప్పదు?

Exit mobile version