Site icon NTV Telugu

Telangana Weather : వచ్చే మూడు రోజుల కూడా సల్లగనే ఉంటదట..!

Weather

Weather

Telangana Weather : దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం , పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా, మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వరకు అదే ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ వాతావరణ స్థితుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు స్థాయికి మించిన స్థాయిలో మూడు నుంచి ఐదు డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

Khushi Kapoor : బికినీలో అక్కను మించిన ఎక్స్పోజింగ్ తో రెచ్చిపోయిన ఖుషీ కపూర్..

మే 18న తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమరంభీం, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు వివరించారు.

Annamaya District: పీలేరులో అదుపుతప్పి బావిలో పడ్డ కారు.. ముగ్గురు మృతి
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 37.8 డిగ్రీలుగా, కనిష్టంగా హైదరాబాద్‌లో 34.1 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. మే 17న అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, హనుమకొండలో నమోదయ్యాయి.

Exit mobile version