TS High Court: టీచర్ల బదిలీలపై ఈనెల 19 వరకు హైకోర్టు స్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీపై ఈనెల 19 వరకు తెలంగాణ హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతుల తర్వాతే బదిలీలు చేయాలని రంగారెడ్డి జిల్లా టీచర్ల తరపున దాఖలైన పిటిషన్‌ను నేడు (శుక్రవారం) జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బెంచ్ విచారణ చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాది బాలకిషన్ రావు వాదనలు వినిపించగా.. వాదనలు విన్న జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.. టీచర్ల బదిలీ ఈ నెల 19 వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Read Also: MG ZS EV: భారీగా తగ్గిన ఎంజీ జెడ్ఎస్ ఈవీ కార్ ధరలు..ఏకంగా రూ. 2 లక్షల వరకు ఆదా..
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
కాగా, రంగారెడ్డి జిల్లాలో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్ అర్హత కేసులుండటంతో పాటు పదోన్నతులపై స్టే ఉండటంతో రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లలో పదోన్నతులు చేపట్టకుండా కేవలం బదిలీలు మాత్రమే చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై రంగారెడ్డి టీచర్లు కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం బదిలీలపై స్టే విధించింది. అయితే, తెలంగాణలో టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూలును విద్యాశాఖ విడుదల చేసింది. రెండు మల్టీజోన్లలో పదోన్నతులను పక్కన పెట్టి.. కేవలం బదిలీలు మాత్రమే పూర్తి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read Also: Pawan Kalyan: సినిమా వాళ్లు భయంతో ఉన్నారు.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
రంగారెడ్డి జిల్లాల్లో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్ అర్హత కేసులు, పదోన్నతులపై స్టే ఉండటంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 3 నుంచి 8 వరకు బదిలీల ప్రక్రియ జరుగనుంది. ఈ మేరకు అక్టోబరు 3న బదిలీలకు సంబంధించిన షెడ్యూలును రిలీజ్ చేసింది. అక్టోబరు 6, 7 తేదీల్లో బదిలీలకు సంబంధించిన వెబ్‌ఆప్షన్‌కు ఛాన్స్ ఇచ్చింది. అక్టోబరు 8న వెబ్ ఆప్షన్ల సైతం ఎడిట్ చేసుకునే వీలు ఇచ్చింది. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత ఖాళీల పాయింట్లు, స్పౌజ్ పాయింట్లో ఎలాంటి మార్పులుండవని విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. కానీ అనూహ్యంగా టీచర్ల బదిలీలను అక్టోబర్ 19 వరకు నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.
తాజావార్తలు
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?