Site icon NTV Telugu

Schools Reopen : వేసవి సెలవులకు గుడ్‌బై.. పండుగ వాతావరణంలో స్కూల్స్‌ రీఓపెన్‌

Schools Reopen

Schools Reopen

Schools Reopen : వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థుల బడిబాట ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. జూన్ 12న ఉదయం 9 గంటలకు తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ పాఠశాలలు పునఃప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. పిల్లలకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు ఉపాధ్యాయులు స్కూల్స్‌ను పండుగ వాతావరణంగా తీర్చిదిద్దుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 26,067 ప్రభుత్వ పాఠశాలలు, 11,650 ప్రైవేటు పాఠశాలలు, 495 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. విద్యాశాఖ ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని జూన్ 6 నుంచి ప్రారంభించింది. అయితే కొత్త విద్యాసంవత్సరం మొదలవుతున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య కేసులో కుట్రదారుడు అక్తర్ అరెస్ట్

ప్రైవేట్ పాఠశాలలకే ఎక్కువ మంది తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇస్తుండడంతో, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల కొరతను ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది 1,25,000 మంది ఫస్ట్ క్లాస్ విద్యార్థులలో కేవలం 27,000 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, మిగిలిన వారు ప్రైవేట్ స్కూల్స్‌లో చేరారు. గతేడాది 1,990 ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల చేర్పు లేక మూతపడ్డాయి.

ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు ముందుగానే చేరుకున్నాయి. కానీ యూనిఫాంల విషయంలో ఇంకా సమస్యలు కొనసాగుతున్నాయి. కొన్ని స్కూల్స్‌కు ఒక జత యూనిఫాంలు మాత్రమే అందాయి, మరికొన్నింటికి ఇంకా రాలేదు. ఉపాధ్యాయుల అభిప్రాయం ప్రకారం, సకాలంలో అన్ని సదుపాయాలు అందితే ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యకు గండికాదని స్పష్టం చేస్తున్నారు.

కొత్త సంవత్సరం ప్రారంభంలోనే పాత సమస్యలు తలెత్తుతున్నా, వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ చెబుతోంది. విద్యార్థుల హాజరుతోనే ప్రభుత్వ బడుల భవిష్యత్ దాగి ఉంది. మరి ఈసారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తారో చూడాలి.

Thammudu : ఇదేంటి దిల్ రాజు ఇలా ఓపెన్ అయ్యాడు?

Exit mobile version