Kishan Reddy : తెలంగాణ రాష్ట్రంలో రహదారి మౌలిక వసతుల కల్పనకు ఒక విప్లవాత్మక ముందడుగు పడిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక , ఉత్తరాద్య విధానాల మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 5న తెలంగాణ రాష్ట్రానికి వస్తారని, ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.5,413 కోట్ల విలువైన వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారని వివరించారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని రవాణా వ్యవస్థ మరింత బలపడుతుందనీ, పారిశ్రామిక వృద్ధికి ఇది కీలకంగా మారుతుందనీ, పలు వేల ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ ప్రభుత్వ కట్టుదిట్టమైన భద్రతా, అభివృద్ధి లక్ష్యాల ప్రకారం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు మౌలిక వసతుల రంగంలో నిరంతర సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Viral Video: వీరి యాక్టింగ్ ముందు చాలామంది హీరోహీరోయిన్స్ కూడా పనికిరారుగా..?!
ప్రాజెక్టుల వివరాలను చూస్తే, సిర్పూర్–కాగజ్‌నగర్ ప్రాంతానికి సంబంధించిన రహదారి అభివృద్ధికి ఒక్కటే రూ.3,862 కోట్ల వ్యయం కేటాయించబడి ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.3,694 కోట్లతో 123 కిలోమీటర్ల పొడవున రహదారులు నిర్మించబడ్డాయని, ఇవి త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే 8.1 కిలోమీటర్ల కొత్త రహదారి నిర్మాణానికి రూ.168.47 కోట్లు మంజూరు చేసి భూమిపూజ నిర్వహించనున్నారు.
ఇక హైదరాబాద్ ప్రాంతానికి ప్రత్యేకంగా రూ.1,552.91 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించబడ్డాయి. ఇందులో భాగంగా రూ.895.64 కోట్ల వ్యయంతో 22.57 కిలోమీటర్ల రహదారులు నిర్మించబడ్డాయి. మరోవైపు, రూ.657.27 కోట్లతో 20.87 కిలోమీటర్ల కొత్త రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ మొత్తం అభివృద్ధి ప్రణాళిక తెలంగాణ రాష్ట్రంలో రవాణా సౌలభ్యతను పెంచడంతో పాటు, ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేసి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
