Telangana Rising Global Summit 2025: అంగరంగ వైభవంగా అంతర్జాతీయ వేడుక.. గ్లోబల్ సదస్సుకు ప్రపంచ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rising Global Summit 2025: భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజులపాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ–సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్‌లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్డనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూనీసెఫ్ ప్రతినిధులతో పాటు TERI, BCG, Micron India, Hitachi Energy, O2 Power, Greenko, Apollo Hospitals, IIT Hyderabad, NASSCOM, Safran, DRDO, Skyroot, Dhruva Space, Amul, Laurus Labs, GMR, Tata Realty, Kotak Bank, Goldman Sachs, Blackstone, Deloitte, CapitaLand, Swiggy, AWS, RED.Health, PVR INOX, Sikhya Entertainment, Taj Hotels వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
READ MORE: Woman Bitten by Snake: పామును పట్టేందుకు ప్రయత్నించిన మహిళ.. తర్వాత ఏమైందంటే..
Also Read
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
పివి సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు ‘Olympic Gold Quest’ సెషన్లో పాల్గొంటారు. రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు ‘Creative Century – Soft Power & Entertainment’ చర్చలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులను సమన్వయం చేస్తున్నారు. దావోస్‌లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ను తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగాలని ముఖ్యమంత్రి స్వయంగా ఈ సదస్సు ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నారు. అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఈ సదస్సు వేదికలో రెండో రోజున డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్ను ఆవిష్కరిస్తుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్‌ను ఈ డాక్యుమెంట్లో పొందుపరిచారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అన్ని రంగాల్లో భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను పొందుపరిచారు.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్‌కి షాక్ ఇచ్చిన మిత్రపక్షాలు.. ‘రెండు ఆకుల’ రాజకీయంలో దళపతి వెనకడుగు!
-
Peddi: తమిళ్, మలయాళ బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ దండయాత్ర మొదలు!
-
Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
ట్రెండింగ్
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!