Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 31 వరకే ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Civil Supplies: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ తీపి కబురు అందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ముమ్మరంగా సాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ-కేవైసీ (e-KYC) నవీకరణ పూర్తికాకపోతే నిత్యావసర సరకులు నిలిచిపోతాయనే ఆందోళనలో ఉన్న కార్డుదారులకు ఊరటనిస్తూ, e-KYC పూర్తి చేసే గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి తెలిపారు.
దీంతో పాటు వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు, ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు లబ్ధిదారులు ప్రతినెలా రేషన్ షాపుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పొందే వెసులుబాటు కల్పించారు. ఇంకా e-KYC పూర్తి చేయని లబ్ధిదారులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వెంటనే తమ సమీపంలోని రేషన్ దుకాణాలను సంప్రదించి, ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడంతో పాటు నిర్ణీత తేదీల్లో మూడు నెలల కోటా బియ్యాన్ని తప్పకుండా తీసుకెళ్లాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.
Also Read
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
తాజావార్తలు
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!