Site icon NTV Telugu

Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు!

Telangana Rains

Telangana Rains

Rain Alert for Telangana: తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ తీరంలో ద్రోణి ఏర్పడిందని, తూర్పు దిశ నుంచి రాష్ట్రం వైపుగా తీవ్ర గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుముఖం పడుతాయని, ప్రజలు ఉదయం వేళల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Also Read: Health Tips : పరగడుపున ఈ నీటిని తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. నల్గొండలో 1.7డిగ్రీలు, హైదరాబాద్‌లో 1 డిగ్రీ సెల్సియస్‌ తగ్గి.. 29 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఖమ్మంలో 4.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 2.3 డిగ్రీలు, భద్రాచలంలో 2.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా ఎక్కువగానే నమోదయ్యాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు హైదరాబాద్‌, భద్రాచలం, ఖమ్మంలలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.9 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.

Exit mobile version