Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యుత్ రంగ వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. దసరా, దీపావళి పండుగల వేళ ప్రజలకు శుభవార్తలు చెప్పాల్సింది పోయి, ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ఏకంగా రూ.5,420 కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన రుద్దాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు భారీ విద్యుత్ బిల్లులతో ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో గతంలో రూ.12,700 కోట్లకు పైగా ట్రూ-అప్ ఛార్జీలు వేయాలని ఈఆర్సీ సూచించినా, ప్రజలపై ఆ ఆర్థిక భారాన్ని మోపడానికి కేసీఆర్ ఎప్పుడూ అనుమతించలేదని గుర్తుచేశారు.
రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వహణ లోపాలు, సంపూర్ణ నిర్లక్ష్యమే కారణమని హరీశ్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.91 వేల కోట్లతో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి, సబ్ స్టేషన్లను, ఉత్పాదక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచి 24 గంటల నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించామని తెలిపారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బొగ్గు నిల్వలు, రిజర్వాయర్లలో నీటిని సద్వినియోగం చేసుకోలేక విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా దెబ్బతీశారని ఆరోపించారు. సరైన నిర్వహణ లేక థర్మల్ ప్లాంట్లు మూతపడుతున్నాయని, కరెంట్ సరఫరా లేక రైతులు పొలాల వద్ద పడిగాపులు కాస్తూ పాము కాట్లకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆయన తీవ్రంగా విమర్శించారు. చాలదన్నట్లుగా వేల కోట్ల విలువైన ట్రాన్స్‌కో, జెన్కోలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తారని, కానీ ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెడుతోందని ఎద్దేవా చేశారు. తక్షణమే ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మోపుతున్న రూ.5,420 కోట్ల భారాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని, ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక తుగ్లక్ నిర్ణయాలను వెనక్కి తీసుకునే వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శనంలో పెద్దఎత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!