TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!
- తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
- 5000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
- 5 వేల పోలీస్ పోస్టుల భర్తీ ఇలా
- ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt Approves 5000 Police Posts: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ కేటగిరీలలో ఖాళీగా ఉన్న 5,000 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. పోలీసు శాఖలో ఉన్న ఖాళీలను సమీక్షించిన అనంతరం శాఖ అవసరాలు, సిబ్బంది కొరత, ఆర్థిక భారం వంటి అంశాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకాలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వం టీఎస్ఎల్పీఆర్బీని ఆదేశించింది. స్థానిక కేడర్ల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు, రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను హోం శాఖ, డీజీపీ కార్యాలయం రిక్రూట్మెంట్ బోర్డుకు వెంటనే అందజేయాలని సూచించింది. అన్ని వివరాలు అందిన వెంటనే టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసి.. నియామక షెడ్యూల్‌ను ప్రకటించనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు త్వరలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం లభించనుంది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
- AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
- Ashwin: "కోహ్లీ కంటే బుమ్రానే బెటర్".. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
ఈ భారీ నియామక ప్రక్రియతో తెలంగాణ పోలీసు శాఖలో సిబ్బంది కొరత కొంత మేర తీరనుండగా.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలీసు నియామకాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో కొత్త ఆశలను నింపింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది నాలుగో నోటిఫికేషన్. 2015 చివరలో 9281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా.. 2018లో 1217 మంది ఎస్సై పోస్టులు, 16285 మంది కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. 2022లో 554 ఎస్సై పోస్టులతో పాటు 15644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. తాజాగా 5 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
5 వేల పోస్టుల భర్తీ ఇలా:
సబ్-ఇన్స్పెక్టర్ (సివిల్) – 148 పోస్టులు
సబ్-ఇన్స్పెక్టర్ (ఏఆర్) – 14 పోస్టులు
రిజర్వ్ సబ్-ఇన్స్పెక్టర్ (టీజీఎస్పీ) – 12 పోస్టులు
సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఏఆర్ సీపీఎల్) – 5 పోస్టులు
అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ఎఫ్‌పీబీ) – 3 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) – 3,697 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) – 1,052 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్) – 24 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) – 20 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) – 25 పోస్టులు
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
-
AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!