Site icon NTV Telugu

Telangana Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల్లో క్షుద్ర పూజల కలకలం.. గెలుపు కోసం ఏకంగా..!

Black Magic

Black Magic

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సర్పంచ్ అభ్యర్థి పదవులు గెలవడం కోసం పలువురు అడ్డదారులు తొక్కుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మద్యం, డబ్బులు పంపిణీ చేసి గెలవాలని పలుచోట్ల అభ్యర్థులు ప్రయత్నాలు చేశారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో గెలవడం అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఏకంగా క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారు. నేడు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపింది.

Also Read: Ajith Kumar : అజిత్ నెక్ట్స్ మూవీపై కోలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ బజ్..

ఖమ్మం రూరల్ మండలం గోళ్ళపాడు గ్రామంలో ప్రత్యర్థులు క్షుద్ర పూజలు చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొండల రవికి కత్తెర గుర్తు వచ్చింది. అదే కత్తెర గుర్తు నమోనా బ్యాలెట్ పత్రాన్ని క్షుద్ర పూజలు చేసి.. గ్రామపంచాయతీ కార్యాలయం ముందు పెట్టారు. ఈ ఘటన గ్రామంలో అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రత్యర్థికి సంబంధించిన వారే ఈ క్షుద్ర పూజలు చేశారని గ్రామంలోని జనాలు అంటున్నారు. రెండో దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ క్షుద్ర పూజలు గ్రామంలో కనపడటం భయాందోళనకు గురిచేసింది. ఇది ప్రత్యర్థులు చేశారా? ఇంకెవరైనా చేశారా? అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.

 

Exit mobile version