Harish Rao: ఏపీ మంత్రులకు హరీష్‌రావు కౌంటర్.. మా గురించి మాట్లాడకండి మీకే మంచిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. దీంతో.. ఏపీ మంత్రులు కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు.. ఇక, వారి వ్యాఖ్యలపై మరోసారి అదేస్థాయిలో స్పందించారు మంత్రి హరీష్‌రావు.. సంగారెడ్డి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందని సవాల్ చేశారు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది.. బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉంది.. కేసీఆర్ కిట్ ఉంది. కళ్యాణ లక్ష్మి ఉంది.. ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉంది అంటూ రాష్ట్రంలో అమలు చేస్తోన్న పథకాల గురించి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. ఏపీలోని రాజకీయ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్‌రావు..
ప్రత్యేక హోదా కేంద్రం ఎగబెట్టినా ఏమీ అడగరు.. ఏపీ లో ఏముంది..? అని ప్రశ్నించారు హరీష్‌రావు.. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరూ మాట్లాడటం లేదన్న ఆయన.. విశాఖ ఉక్కును తుక్కు కింద పెట్టినా మాట్లాడని పరిస్థితి ఉందన్నారు.. అధికార పార్టీ అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదని కౌంటర్ ఇచ్చారు.. రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పని చేస్తున్నాయని ఆరోపించారు. అయితే, అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకండి.. అది మీకే మంచిదని ఆంధ్ర మంత్రులకు సూచించారు.. ఇక, ఢిల్లీలో ఉన్నోళ్లు మనల్ని నూకలు బుక్కమని ఎగతాళి చేశారు.. తెలంగాణ ప్రజలంతా కలిసి ఢిల్లీలో ఉన్నోడికి నూకలు బుక్కీయ్యాలి అని పిలుపునిచ్చారు మంత్రి హరీష్‌రావు.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులు అక్కడ ఓటు హక్కును రద్దు చేసుకుని తెలంగాణలో పొందాలని హరీష్‌రావు సూచించారు.. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలే అని పేర్కొన్న ఆయన ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వారంతా తెలంగాణలోనే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.. ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసిన మీరు అక్కడ రోడ్లు, ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందో చూసే ఉంటారని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఏపీ కంటే చాలా బెటర్ అని అందుకే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలోనే ఓటు నమోదు చేసుకోవాలంటూ హరీష్ రావు వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. తెలంగాణ మంత్రులు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. హరీష్ రావు ఒకసారి ఏపీలోకి తొంగి చూస్తే వైసీపీ ప్రభుత్వం చేసే అభివృద్ధి కనిపిస్తుందని పేర్కొన్నారు.. తాజాగా, హరీష్‌రావు.. కారుమూరి నాగేశ్వరరావు కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!