తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Inter Advanced Supplementary Results: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) అధికారులు ఫలితాలను ఆన్లైన్లో ప్రకటించారు. జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ ఏడాది నిర్వహించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 3,98,498 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులతో పాటు మార్కులు మెరుగుపర్చుకోవడానికి ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఉన్నత విద్య ప్రవేశాలు, కౌన్సెలింగ్ ప్రక్రియలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు వేగంగా ఫలితాలను విడుదల చేసింది.
Also Read
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 2,67,331 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 1,84,042 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 68.84గా నమోదైంది. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1,31,128 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 64,639 మంది పాస్ అయ్యారు. ఈ విభాగంలో ఉత్తీర్ణత శాతం 49.29గా నమోదైంది.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
* తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in ను సందర్శించాలి.
* హోమ్‌పేజీలో కనిపించే ‘Inter Advanced Supplementary Results’ లింక్‌పై క్లిక్ చేయాలి.
* జనరల్ లేదా ఒకేషనల్ కోర్సును ఎంపిక చేసుకోవాలి.
* ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్‌ను ఎంచుకోవాలి.
* హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
* వెంటనే మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
* భవిష్యత్తు అవసరాల కోసం మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవడం లేదా ప్రింట్ తీసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?