NTV Telugu Site icon

SSIA: సింగపూర్‌ సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్‭తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Ssia

Ssia

SSIA: తెలంగాణ పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు సింగపూర్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ (SSIA)తో ప్రత్యేక రౌండ్ టేబుల్ చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో SSIA ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొని, తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బ్రియాన్ టాన్ (SSIA ఛైర్మన్), టాన్ యూ కాంగ్ SSIA వైస్ ఛైర్మన్, గ్లోబల్ ఫౌండ్రీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్), అప్లైడ్ మెటీరియల్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమ స్థాపనకు అనుకూల పరిస్థితులను విశ్లేషించారు.

Also Read: Formula E race inquiry: ఏసీబీ విచారణలో గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీలు

మంత్రి శ్రీధర్ బాబు సమావేశంలో తెలంగాణాలోని పథకాలు, రాష్ట్రంలో అనుకూల వ్యాపార వాతావరణం, ప్రపంచ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, తెలంగాణ రాష్ట్రం కీలకమైన కేంద్రంగా మారాలని ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానానికి SSIA ప్రతినిధులు చాలా సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఈ ఏడాది చివర్లో సింగపూర్ పరిశ్రమల ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ను సందర్శించి, ప్రాథమిక పరిశీలన చేపడతారని వారు తెలియజేశారు.

Also Read: Formula E race inquiry: ఏసీబీ విచారణలో గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీలు

ఈ చర్చతో తెలంగాణ రాష్ట్రం సెమీకండక్టర్ పరిశ్రమలో కీలక పెట్టుబడులను ఆకర్షించడంలో ముందడుగు వేసింది. తెలంగాణలో ఉన్న అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుకూలమైన విధానాలు సింగపూర్ పరిశ్రమను ఆకర్షించాయి. ఈ భాగస్వామ్యం తెలుగు రాష్ట్రానికి కొత్త ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధి, ప్రాచుర్యం తీసుకురావడంలో సహాయపడే అవకాశం ఉంది. సెమీకండక్టర్ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో మరింత పెట్టుబడులు, అభివృద్ధిని ఆహ్వానించనున్నాయి. హైదరాబాద్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుంది.