Indiramma Indlu: రూ.5 లక్షలతో 20 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు తక్కువ ఖర్చుతో, వేగవంతంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అందించేందుకు ఒక వినూత్న మోడల్ ఇంటిని సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో రూ.5 లక్షల వ్యయంతో కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే నిర్మించిన ఈ మోడల్ ఇందిరమ్మ ఇంటిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుండగా, అదే బడ్జెట్లో నాణ్యమైన ఇంటిని వేగంగా నిర్మించి ఇవ్వడానికి కాల్జన్ సంస్థ ముందుకు వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారులు ఈ మోడల్ ఇంటిని నేరుగా పరిశీలించి, ఇటువంటి ఆధునిక నిర్మాణ విధానాలను ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read
- Rain Alert In Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పొంచి ఉన్న తుఫాన్..
- AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం..
- Sonia Gandhi: సోనియా ప్రధాని కాకపోవడానికి కారణం వాళ్లే.. సంచలన విషయాలు వెలుగులోకి..
- Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
ఈ నిర్మాణం వెనుక ఉన్న సాంకేతికతను వివరించిన కాల్జన్ సంస్థ యజమాని కార్తీక్, తమ సంస్థ స్టీల్ ఇన్ఫ్లుయెన్స్ ఫామ్‌వర్క్ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఉత్పత్తులతో పాటు మోనోలిథిక్ కాంక్రీట్ విధానాన్ని వాడటం వల్ల నిర్మాణం ఎంతో బలంగా ఉంటుందని, 15 నుంచి 20 రోజుల స్వల్ప సమయంలోనే పూర్తి పనులు పూర్తి చేసి ఇల్లు అందిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఈ సాంకేతికతతో నిర్మించే ఇళ్లకు 15 నుంచి 20 సంవత్సరాల వరకు గ్యారెంటీ ఇస్తున్నట్లు వివరించారు.
ఈ మోడల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు పెంటారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఇంజనీర్లు మరియు కాల్జన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. తక్కువ సమయంలో, పరిమిత బడ్జెట్లో సొంతింటి కల నెరవేర్చే ఈ తరహా ఆధునిక నిర్మాణాలు పేదలకు ఎంతగానో ప్రయోజనకరంగా మారనున్నాయి.
తాజావార్తలు
-
Indiramma Indlu: రూ.5 లక్షలతో 20 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం!
-
Shaji Kumar : షూటింగ్ పూర్తవగానే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హఠాన్మరణం!
-
Rain Alert In Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పొంచి ఉన్న తుఫాన్..
-
Pawan Kalyan : పవన్ విడాకుల ప్రకటనపై మాజీ భార్య రేణూ దేశాయ్ రియాక్షన్ ఇదే!
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం..
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?