Indiramma Houses : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ఒక గొప్ప ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు తక్కువ ధరలకే సిమెంట్ , స్టీలు సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు, సంబంధిత ప్రభుత్వ అధికారులు సిమెంట్ , స్టీలు ఉత్పత్తి చేసే వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల కంటే గణనీయంగా తక్కువ ధరకు లబ్ధిదారులకు సిమెంట్ , స్టీలును అందించే విషయంపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం మార్కెట్లో సుమారు ₹320 పలుకుతున్న ఒక సిమెంట్ బస్తాను ₹260కే అందించాలని అధికారులు ఆయా కంపెనీలను కోరారు.
Off The Record: ఆళ్లగడ్డలో నేలబారు వ్యవహారాలు నడుస్తున్నాయా..? ఎమ్మెల్యే మనుషుల చికెన్ దందా..
అదేవిధంగా, ప్రస్తుతం టన్నుకు దాదాపు ₹55,000 ఉన్న స్టీలును ₹47,000కే సరఫరా చేయాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సుమారు 180 సిమెంట్ బస్తాలు , 1500 కిలోల స్టీలు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తక్కువ ధరలకు సిమెంట్ , స్టీలును సరఫరా చేయగలిగితే, లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఇది పేద ప్రజల గృహ నిర్మాణ భారాన్ని తగ్గించడమే కాకుండా, ఎక్కువ మంది సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది.
