తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 3 నుంచి ఈ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తొలి విడత ఐసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం నవంబర్ 3 నుంచి 9 వరకు స్లాట్ బుకింగ్ ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలియజేశారు. నవంబర్ 6 నుంచి 10 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు.
Read Also: కొత్తిమీర తినేవాళ్లు ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Also Read
మరోవైపు నవంబర్ 6 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుందని నవీన్ మిట్టల్ తెలిపారు. నవంబర్ 14న తొలి విడత సీట్లను కేటాయిస్తామన్నారు. నవంబర్ 14 నుంచి 18 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు. అటు నవంబర్ 21 నుంచి సర్టిఫికెట్ల స్లాట్ బుకింగ్‌తో ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. నవంబర్ 22న సర్టిఫికెట్ల పరిశీలన, 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుందన్నారు. 26న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. స్పాట్ ప్రవేశాల కోసం నవంబర్ 28న మార్గదర్శకాలను జారీ చేస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!