High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: భర్తను కడతేర్చిన కేసులో ఓ భార్యకు ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ సంచలన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో ఓ గొడవ సందర్భంగా భార్య తన భర్తను కత్తితో పొడిచి చంపింది. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు, ఆమెను సెక్షన్ 304 పార్ట్-II (హత్యకాని నేరపూరిత నరహత్య) కింద దోషిగా తేల్చి, నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించింది. అయితే, ఈ శిక్షను సవాల్ చేస్తూ సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ తిరుమల దేవి ఈడ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమెకు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తూ, కేవలం 500 రూపాయల జరిమానాతో ఈ కేసును ముగించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సంఘటన జరిగిన రోజు మృతుడు మొదట పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అతను బయటకు వెళ్లిపోయాడు. కానీ మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు అర్ధనగ్నంగా వచ్చి, భార్యను, ఆమె తల్లిదండ్రులను అసభ్య పదజాలంతో దూషిస్తూ నానా హంగామా సృష్టించాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భార్య, తన వద్ద ఉన్న కత్తితో భర్త మెడపై పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను మృతి చెందాడు. ఈ కేసు విచారణలో భాగంగా భార్య తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని, భర్త ప్రవర్తన అత్యంత అభ్యంతరకరంగా ఉండటం వల్లే ఆమె తీవ్ర ఆవేదనకు లోనైందని పేర్కొంది. ఆమెకు తన భర్తను చంపాలనే ఉద్దేశం ఏమాత్రం లేదని, అప్పటికప్పుడు జరిగిన గొడవలో ఆవేశంతో అలా చేసిందని వాదించింది. అయితే ప్రాసిక్యూషన్ మాత్రం దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరింది. ఇరుగుపొరుగు సాక్ష్యాలు, పోస్టుమార్టం నివేదికలు, నిందితురాలు చూపించిన కత్తిని స్వాధీనం చేసుకోవడం వంటి అంశాలను కోర్టు ముందు ఉంచింది. మెడపై తీవ్రమైన గాయం కావడం వల్లే కీలక అవయవాలు దెబ్బతిని అతను చనిపోయాడని వైద్య నివేదికలు ధృవీకరించాయి.
Also Read
అన్ని ఆధారాలను, పరిస్థితులను పరిశీలించిన హైకోర్టు ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య కాదని స్పష్టం చేసింది. భర్త అసభ్యకర ప్రవర్తన వల్ల కలిగిన ఆకస్మిక ఆవేశంలోనే (Spur of anger) ఈ ఘోరం జరిగిందని, ఇది ఐపీసీ సెక్షన్ 300లోని ఎక్సెప్షన్ 4 కిందకు వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే సెక్షన్ 304 పార్ట్-II కింద ఆమె నేరాన్ని సమర్థిస్తూనే.. పరిస్థితులను బట్టి జైలు శిక్షను రద్దు చేసింది. ఇప్పటికే ఆమె చెల్లించిన 500 రూపాయల జరిమానాను శిక్షగా పరిగణిస్తూ కేసును కొట్టిపారేసింది. స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ, నేరం వెనుక ఉన్న పరిస్థితులు శిక్షను తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?