Site icon NTV Telugu

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ విషయంలో తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు

Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్‌ నెంబర్లు, ఫోటోలు బహిర్గతం కావడంపై హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇక మీద ఇలా జరిగితే కోర్టు ఉల్లంఘనల కిందకు వస్తుందని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో సంయమనం పాటించాలని, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతాలు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనెల 23న కౌంటర్‌ దాఖలు చేస్తామని కేంద్రం హైకోర్టుకు వెల్లడించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను 23కు హైకోర్టు వాయిదా వేసింది.

Read Also: TGSRTC: ఆర్టీసీలో 3035 కొలువులు.. ఉద్యోగార్థులకు ఎండీ వీసీ సజ్జనార్ కీలక అలర్ట్

 

Exit mobile version