Group 1 : తెలంగాణలో గ్రూపు-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. గ్రూపు-1 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ 20 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గురువారం కోర్టు విచారణ ప్రారంభించింది. హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు నియామక పత్రాలు జారీ చేయకూడదని స్పష్టం చేసింది.
ఇటీవల, గ్రూపు-1 పరీక్షపై రాజకీయ రచ్చ కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, గ్రూపు-1 నియామకాల్లో కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. “పరీక్ష రాని 10 మందికి ఫలితాలు ఎలా వచ్చాయి?” అని ప్రశ్నించారు. ఆయన సీబీఐ విచారణను కోరుతూ, పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై టీజీపీఎస్సీ స్పందించింది. గ్రూపు-1 పరీక్షలో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, టీజీపీఎస్సీ ప్రకారం అన్ని నిబంధనలను పాటిస్తూ, నిపుణులతో వాల్యుయేషన్ చేయించినట్లు పేర్కొంది.
India- Pakistan: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..