Telangana High Court: తెలంగాణ హైకోర్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గానూ న్యాయస్థానం ఈ కఠిన చర్య తీసుకుంది. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో పిటిషనర్‌కు తగిన రక్షణ కల్పించాలని గతంలో హైకోర్టు పోలీసు అధికారులను ఆదేశించింది. అయితే, ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, ఆదేశాలను ఉల్లంఘించినందుకు సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలకు రెండు వారాల పాటు జైలు శిక్షతో పాటు రూ. 2,000 చొప్పున జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana High Court: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, డీసీపీ కోటిరెడ్డిలకు జైలు శిక్ష

Hyd News
