Site icon NTV Telugu

Justice Alok Arade: జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనాన్ని ప్రారంభించిన తెలంగాణ హైకోర్టు సీజే

Ts Cj

Ts Cj

కుషాయిగూడ పరిధిలో ఉన్న ఆపిల్ బిల్డింగ్ లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే నేడు (శనివారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ లో రాజీ చేయబడిన యాక్సిడెంట్ క్లైమ్ 25 లక్షల రూపాయల చెక్కును లబ్ధిదారులకు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే ఫిర్యాదుదారు న్యాయవాదులు పెంచాల సురేందర్ రావు, జంబుల తిరుపతిరెడ్డి, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ లైసెన్స్ ఆఫీసర్లతో కలిసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రావు, అదనపు జిల్లా న్యాయమూర్తి రఘునాథ్ రెడ్డిల సమక్షంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.

Read Also: Karnataka High Court: ప్రార్థనల కోసం నివాస గృహాన్ని ఉపయోగించడంపై ఎలాంటి ఆంక్షల్లేవ్..

అనంతరం పిటిషన్ న్యాయవాదులు పెంచాల సురేందర్ రావులు మాట్లాడుతూ మాట్లాడుతూ.. రాజీయే రాజ మార్గంగా ఇరువైపుకక్షి దారులకు మేలు చేకూరేలాగా లోక్ అదాలత్ చేపట్టడం శుభసూచకమని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కేసును లబ్ధిదారులకు న్యాయం చేకూర్చే విధంగా లోక్ అదాలత్ కోర్ట్ లో రాజీ కుదర్చడం జరిగిందని అన్నారు. జిల్లా న్యాయస్థాన భవన సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇలాంటి మంచి పని చేయడం ద్వారా అందరూ న్యాయవాదులకు మంచి జరుగుతుందని ఆయన ఆశాబావం వ్యక్తం చేశారు.

Read Also: Allu Arjun: చరణ్ – అల్లు అర్జున్ మధ్య గొడవలు.. ఇదే అసలు నిజం

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ న్యాయవాది రాజేశ్వరరావు, బార్ కౌన్సిల్ మెంబర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోట రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజు యాదవ్, సొసైటీ డైరెక్టర్ సీహెచ్ కృష్ణ, మాజీ అధ్యక్షులు కారంగుల యాదగిరి రావు, పబ్బా రమేష్, సుదీర్ కుమార్, అజయ్ కుమార్ గౌడ్, లక్ష్మీ నరసయ్య, సీనియర్ న్యాయవాదులు చెన్నారెడ్డి, కిరీట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ఉదయ్ కుమార్, యాటా భాస్కర్, అమరేందర్ రెడ్డి, పొన్నం దేవరాజ్, విక్రమ్ కుమార్, జాజల కుమార్ తదితరులు ఉన్నారు.

Exit mobile version