Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- తీవ్ర ఎండలతో అల్లాడుతోన్న తెలంగాణ
- పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
- రాబోయే ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Heatwave Alert for Next 5 Days: తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఎండలతో అల్లాడుతోంది. మండుతున్న ఎండలతో రాష్ట్రం మొత్తం హీట్ కోర్ జోన్‌గా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ చేశారు. రాబోయే ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఈరోజు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని సూచించారు. మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
రేపటి పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నల్గొండ జిల్లాకు కూడా రెడ్ అలెర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం, ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఎండ తీవ్రత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మధ్యాహ్న సమయంలో రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. మరోవైపు విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. రైతులు, కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!