Group1 Results: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. నేడు విడుదలకానున్న ఫలితాలు
- గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త..
- నేడు విడుదలకానున్న పరీక్ష ఫలితాలు.
- 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group1 Results: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్-1 ఫలితాలు ఈ రోజు (సోమవారం) విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తరువాత ఇవే మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు కావడం విశేషం. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకూ గ్రూప్-1 మెయిన్ పరీక్షలు జరిగాయి. మొత్తం 563 పోస్టులకు గానూ, 31,403 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షలలో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ (TGPSC) ప్రకటించనుంది. అలాగే, మంగళవారం గ్రూప్-2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్, 14న గ్రూప్-3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించనుంది.
Read Also: Champions Trophy: భారత్ విజయానికి రోహిత్ శర్మ హీరో.. MS ధోని తర్వాత అరుదైన ఘనత
Also Read
- Team India Spin Bowling Coach: 630 వికెట్ల వీరుడికి బీసీసీఐ గౌరవం.. స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక
- Haryana: ‘‘సువేందు బీఫ్ వండాను, తింటావా’’.. మహిళ ఓవరాక్షన్‌కు శిక్ష..
- G Parameshwara: పరమేశ్వరకు లక్కీ ఛాన్స్.. కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
- Rat Control Tips: ఎలుకలకు భయం పుట్టించే ఐదు వాసనలు ఇవే.. సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
ఇకపోతే, గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల ప్రకటనతో గ్రూప్-1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటన జరుగుతుంది. ఆ తరువాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి, ఆ ప్రక్రియ పూర్తయిన తరువాత 1:2 నిష్పత్తిలో జాబితా విడుదల అవుతుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు. గ్రూప్-1 ఫలితాల విడుదలలో అనేక న్యపరమైన సమస్యలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు నెల క్రితం దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. గతంలో కొంతమంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్లు కొట్టివేయబడ్డాయి. అనంతరం వారు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది.
తాజావార్తలు
-
Team India Spin Bowling Coach: 630 వికెట్ల వీరుడికి బీసీసీఐ గౌరవం.. స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక
-
Haryana: ‘‘సువేందు బీఫ్ వండాను, తింటావా’’.. మహిళ ఓవరాక్షన్‌కు శిక్ష..
-
G Parameshwara: పరమేశ్వరకు లక్కీ ఛాన్స్.. కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
-
Rat Control Tips: ఎలుకలకు భయం పుట్టించే ఐదు వాసనలు ఇవే.. సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
-
Anirudh Reddy : తెలంగాణలో పోటీకి సిద్ధమా.? అనిరుధ్ రెడ్డి రాజకీయ సవాల్
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!