Group-1 Results : తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష ఫలితాలను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల నియామక మండలి (TGPSC) విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 563 ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను అధిగమించిన అభ్యర్థుల తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇక గ్రూప్-2 ఫలితాలు కూడా వెలువడనున్నాయి. రేపటికి (మార్చి 11) గ్రూప్-2 ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 20లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలను వెల్లడించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Minister Kandula Durgesh: రుషికొండ బీచ్లో మళ్లీ బ్లూఫ్లాగ్ జెండాను ఎగరవేస్తాం..
అభ్యర్థులు తమ వ్యక్తిగత ఫలితాలు, స్కోర్లు, కట్‌ఆఫ్ మార్కులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. తమ మార్కులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, నిర్దిష్ట గడువులోగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
CM Chandrababu: పథకాలు అమలు, కార్యక్రమాల నిర్వహణపై సీఎం కీలక సమీక్ష