TGPSC : గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే..
- గ్రూప్-1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ నుండి గుడ్ న్యూస్
- 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించేందుకు టీజీపీఎస్సీ తుది సమీక్ష
- వారం నుండి పది రోజుల్లో ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGPSC : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా గ్రూప్-1 మెయిన్స్ (Group-1 Mains) పరీక్షలు గత ఏడాది అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించగా, మొత్తం 21,093 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థుల్లో కేవలం 67.17% మాత్రమే మెయిన్స్ పరీక్ష రాశారు. ఈ గణాంకాల ప్రకారం ఒక్కో పోస్టుకు సుమారు 38 మంది పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసినట్లు ప్రకటించింది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Anil Kumar Yadav : బీజేపీకి హైదరాబాద్‌లో ఓట్లు కావాలి.. మూసీ అభివృద్ధి కాదు..!
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా, 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించేందుకు టీజీపీఎస్సీ తుది సమీక్ష చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, వారం నుండి పది రోజుల్లో ఫలితాలు (Results) విడుదల చేసే అవకాశముంది. మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక జాబితా విడుదల చేయనున్నారు.
ఇక, గ్రూప్-2 (Group-2) , గ్రూప్-3 (Group-3) పరీక్షల ఫలితాల కోసం నిరీక్షణలో ఉన్న అభ్యర్థులకు మరో అప్‌డేట్ ఉంది. టీజీపీఎస్సీ ముందుగా గ్రూప్-1 నియామక ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం.
ఈ ప్రకటనతో గ్రూప్-1 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో (https://www.tspsc.gov.in/) మరిన్ని వివరాలు చెక్ చేసుకోవచ్చు.
Ration Rice Benefits: రేషన్ బియ్యం తింటే ఎన్ని లాభాలో తెలుసా?
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!