Grama Sabha: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాల్గవరోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఇప్ప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,861 గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది మొత్తం లక్ష్యంలోని 85.96 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఒక్క రోజే రాష్ట్రంలో 3,130 గ్రామ సభలు, 856 వార్డు సభలు నిర్వహించినట్లు తెలిపారు సంబంధిత అధికారులు. ఈ కార్యక్రమాలు గ్రామస్థుల సమస్యలపై చర్చించేందుకు, స్థానిక అవసరాలు గుర్తించేందుకు దోహదపడనున్నాయి.
Also Read: Fire Accident: మహేంద్ర షోరూంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!
నేడు గ్రామ సభల నిర్వహణకు చివరి రోజు కావడంతో ప్రభుత్వం మరింత కసరత్తు చేస్తోంది. గ్రామ సభలు పూర్తయిన తర్వాత సమస్యల నివారణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమం గ్రామీణాభివృద్ధికి దోహదపడుతుందని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రేషన్ కార్డుల జారీపై ప్రజలు అసంతృప్తిని వ్యక్త పరిచారు. సంబంధిత అధికారులు దరఖాస్తులు తీసుకుంటున్నా రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, ఐదవరకు దరఖాస్తు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఈ సమస్యలకు ఎలా చెక్ పెట్టనుందో.