Site icon NTV Telugu

Beerla Ilaiah: నోరు అదుపులో పెట్టుకో.. కేటీఆర్ పై ఐలయ్య ఫైర్..!

Ilayya

Ilayya

Beerla Ilaiah: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గురించి అవాక్కులు, చావాక్కులు మాట్లాడటం తగదన్నారు. అంతే కాకుండా అయన మాట్లాడుతూ.. కేటీఆర్ తన నోరును అదుపులో పెట్టుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ ఉమ్మడి జిల్లా మంత్రులు అహర్నిశలు కష్టపడుతూ అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తాగు, సాగు నీటి ప్రాజెక్టుల పరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుండి వాటిని నడిపిస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి జిల్లాలో రోడ్లు నిర్మిస్తున్నారని తెలిపారు.

Read Also: MG Windsor EV: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు 449 కి.మీ రేంజ్‌ వచ్చే ఎంజీ విండ్సర్ EV లాంచ్.. ధరలు, ఫీచర్లు వివరాలు ఇలా..!

ఇక కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలి కులేశ్వరం గా మారిందని ఎద్దేవా చేసారు. ఈసారి కాళేశ్వరం లేకపోయినా రికార్డు స్థాయిలో పంట పండింది. ఇది మీ కళ్ళకి కనిపించడం లేదా? నల్గొండ జిల్లా మా హయాంలో అన్నం పెట్టే జిల్లాగా మారింది. కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులను సీఎం రేవంత్ రెడ్డి సరిదిద్దుతున్నారని అన్నారు. స్కాంల చరిత్ర ఆ పార్టీదే అని బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసారు. ఇక వేయి ఎలుకలు తినిన పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టుగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడని.. కేటీఆర్ మా సీఎంపై నోరు జారితే, నోటిని యాసిడ్‌తో కడుగుతాం.. జాగ్రత్తగా ఉండాలని బీర్ల ఐలయ్య హెచ్చరించారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక చిల్లర విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: Virat Anushka: పికిల్‌బాల్ భాగస్వాములుగా మారిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట..!

Exit mobile version