Site icon NTV Telugu

Govt Land Auction: మరోసారి భూముల వేలానికి సిద్ధమైన రేవంత్ సర్కార్.. ఎకరా రూ.101 కోట్లు!

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి సిద్ధమైంది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌లోని ప్రభుత్వ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయింది. రాయదుర్గ్‌లోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 18.67 ఎకరాలను సర్కార్ వేలం వేయనుంది. ఎకరా రూ.101 కోట్లకు విక్రయించనున్నట్లు తెలంగాణ స్టేట్ ఇండస్టీస్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ప్రకటించింది. ఇదే ధరకు అమ్ముడుపోతే.. దాదాపుగా రూ.1900 కోట్లు ప్రభుత్వంకు రానున్నాయి. ఒకవేళ వేలంలో పోటీ ఉంటే.. మరింత ఎక్కువ సొమ్ము సర్కార్ ఖాతాలో చేరుతుంది.

Also Read: MLC Kavitha: మధ్యాహ్నం కవిత ప్రెస్‌మీట్.. బీఆర్ఎస్‌ నేతలే టార్గెటా?, ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పేనా?

గత నెలలో తెలంగాణ ప్రభుత్వం కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు (కేపీహెచ్‌బీ)కు చెందిన 7.8 ఎకరాల భూమిని ఈ-వేలం ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. ఎకరం రూ.70 కోట్లు పలకగా.. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ కొనుగోలు చేసింది. కేపీహెచ్‌బీ భూముల ద్వారా ప్రభుత్వంకు రూ.547 కోట్లు వచ్చాయి. ఈ భూముల కోసం గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌తో పాటు అరబిందో రియల్టీ, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌, అశోక బిల్డర్‌ వంటి ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు పోటీపడ్డాయి. ఎకరాకు రూ.40 కోట్లను కనీస ధరగా నిర్ణయించగా.. గోద్రెజ్‌ అత్యధిక ధరతో బిడ్‌ దాఖలు చేసింది. అంతకుముందు కూడా భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది.

 

Exit mobile version