తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. టెక్నికల్ విభాగం లో పలు పోస్టుల భర్తీకి మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటి ద్వారా టైపిస్ట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://tshc.gov.in/ సందర్శించొచ్చు.
ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా 324 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే వీటికి దరఖాస్తుల ప్రక్రియ మే 25 నుంచి ప్రారంభం కాగా.. వీటి దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 15, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంటే దరఖాస్తులకు కొన్ని గంటలే సమయం ఉంది. దరఖాస్తు చేయని వారు పైన పేర్కొన్న లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. అదే విధంగా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు..
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి స్కిల్ టేస్ట్ ను నిర్వహించనున్నారు.. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 22,900 నుంచి రూ.69,150 వరకు జీతం ఉండనుంది.. ఇకపోతే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. టైపింగ్ లో హయ్యర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. టైపింగ్ హయ్యర్ సర్టిఫికేట్ లేని వాళ్లకు టైపింగ్ లోయర్ సిర్టిఫికేట్ ఉత్తీర్ణత ఉన్న వాళ్లను కూడా అర్హులుగా పేర్కొన్నారు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవారి వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది..అభ్యర్థులు రూ.600 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి… ఒక్కోదానికి ఒక్కో అర్హతలు ఉన్నాయి.. అందుకే నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు.. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ వల్ల చాలా మందికి నిరుద్యోగ సమస్య తీరిందని, ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ లో గత ఏడాది కంటే ఎక్కువ జాబ్స్ ను ఫీల్ చెయ్యనున్నట్లు సమాచారం..