Site icon NTV Telugu

Governor Tamilisai: భద్రాద్రి రాముడి సేవలో గవర్నర్‌ తమిళిసై

Governor Tamilisai

Governor Tamilisai

Governor Tamilisai: భద్రాద్రి రాముడి సేవలో తరించారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్.. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న ఆమె.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు.. ఆలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసైకి భద్రాద్రి ఆలయం ఈవో రమాదేవి, ఆలయ సిబ్బంది, దేవస్థానం వేద పండితులు.. పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.. ఆ తర్వాత దేవస్థానంలోని మూలవరులను దర్శించుకున్న ఆమె.. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో గవర్నర్‌కు దేవస్థానం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఇక, స్వామివారి దర్శనం అనంతరం క్యూ లైన్ లో ఉన్న భక్తులను పలకరించి వారితో కరచాలనం చేశారు గవర్నర్‌..

Read Also: CM Jagan: శ్రీ లక్ష్మీమహాయజ్ఞంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ (ఫోటోలు)

కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన కోసం హైదరాబాద్‌ నుంచి రైలులో కొత్తగూడెం చేరుకున్నారు గవర్నర్ తమిళిసై.. ఆమెకు స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ అనుధీప్, ఎస్పీ డాక్టర్ వినీత్, ఇతర అధికారులు.. భారీ భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో భద్రాచలం చేరుకున్నారు.. సారపాల ఐటిసి గెస్ట్ హౌస్ లో గవర్నర్‌ బసకు ఏర్పాట్లు చేశారు.. రైల్వే స్టేషన్‌ నుంచి గెస్ట్‌ హౌస్‌కు చేరుకన్న గవర్నర్‌.. ఆ తర్వాత ఆలయానికి వచ్చారు.

Exit mobile version