Nizam College Students : నిజాం కాలేజీ స్టూడెంట్లతో నవంబరు 11న మరోసారి తెలంగాణ సర్కారు జరిపిన చర్చలు సఫలం అయినట్లుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మార్చిలో హాస్టల్‌ను ప్రారంభించినా.. డిగ్రీ విద్యార్థులను హాస్టల్‌లో చేర్చుకునేందుకు కాలేజీ యాజమాన్యం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి సబితా 50-50 శాతం డిగ్రీ పీజీ విద్యార్థులకు కేటాయిస్తామని చెప్పారు. ఆరు నెలల్లో కొత్త బిల్డింగ్ కట్టిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మంత్రి సబిత కూడా ట్వీట్ చేశారు.
గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న నిజాం కళాశాల డిగ్రీ విద్యార్థుల సమస్యను మానవతా దృక్పథంతో ప్రభుత్వం పరష్కరించింది.@KTRTRS , @TelanganaCMO. pic.twitter.com/3ttFT7Nmof
— SabithaReddy (@SabithaindraTRS) November 11, 2022
నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న నిజాం కళాశాల డిగ్రీ విద్యార్థుల సమస్యను మానవతా దృక్పథంతో ప్రభుత్వం పరష్కరించిందని ట్వీట్ చేశారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విద్యార్థులు ఆ హామీలకు ఒప్పుకోలేదు. కళాశాల హాస్టళ్లలో వసతి అవసరమైన సుమారు 500 మంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లోనే తమకు వసతి కల్పించాలని కళాశాల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అస్సలు పట్టించుకోలేదని చెప్పారు. 50 శాతం యూజీ , 50 శాతం పీజీ విద్యార్థులకు హాస్టల్ సీట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికైనా ఉద్యమం నిలిపివేయాలని అధికారులు కోరారు. మొత్తం తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు 100 శాతం హాస్టల్ కేటాయించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని యూజీ విద్యార్థులు స్పష్టం చేశారు.
Read Also: Samantha: సమంతపై సానుభూతి.. నో నెగెటివ్ కామెంట్స్..?
నిజాం కాలేజీలో కొత్తగా నిర్మించిన గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ను యూజీ విద్యార్థినులకు కేటాయించాలంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ జోక్యంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిజాం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు 10 మంది విద్యార్థినులు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో సమావేశమై సమస్యపై చర్చించారు. కానీ, చర్చలు మాత్రం సఫలం కాలేదు.