DigiLocker : ఒకప్పుడు ఏదైనా ప్రభుత్వ పథకానికో, లేదా ఆన్ లైన్ ఎగ్జామ్ కో అప్లయ్ చేయాలంటే సర్టిఫికెట్లన్నీ మోసపోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఏ ఒక్క పేపర్ ను కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన పేపర్లన్నింటినీ డిజిటల్ డాక్యుమెంట్లగా మార్చుకొని స్టోర్ చేసుకునేందుకు సులువైన మార్గం దొరికింది. డిజిలాకర్ అనే అప్లికేషన్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ ఒకే చోట భద్రపరచుకోవడానికి డిజిలాకర్ ఉపయోగపడుతుంది. ఏదైనా పని కోసం సులువుగా డాక్యుమెంట్ ను యాక్సెస్ చేసుకోవచ్చు. డిజీలాకర్ లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు భద్రపరుచుకోవచ్చు. వాటిని ఇతరులతో కూడా షేర్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి భద్రత గురించి ఆలోచించాల్సిన పనిలేదు. డిజీలాకర్ లో మన గుర్తింపు, చిరునామా, లైసెన్స్, పాన్ కార్డ్, ఇలా అన్ని రకాల డాక్యుమెంట్లను స్కాన్ చేసి, డిజిటల్ గా అప్ లోడ్ చేసుకుని, కావాల్సిన సందర్భాల్లో వాటిని పొందొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలకు షేర్ చేయవచ్చు.
Read Also: Jagga Reddy: పూర్తిగా మారిపోయిన జగ్గారెడ్డి.. గుర్తు పట్టడం కూడా కష్టమే..!
డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర సర్కారు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఆన్ లైన్ లో క్లౌడ్ స్టోరేజీ సదుపాయాన్ని ఉచితంగా పొందడం. ఆధార్ నంబర్ ఆధారంగా ఈ ఖాతాను తెరవొచ్చు. 1జీబీ వరకు స్టోరేజీ ఉచితం. ప్రభుత్వ క్లౌడ్ బేస్డ్ సర్వీస్ డీజి లాకర్ యాప్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇది భారత ప్రభుత్వం అందిస్తున్న క్లౌడ్-బేస్డ్ సర్వీస్. వినియోగదారులు వర్చువల్ గా తమ డాక్యుమెంట్ ను ఉపయోగించుకొనే సదుపాయం కల్పించింది. ఇప్పుడు డిజిలాకర్ పని చేయాలంటే ముందుగా వెబ్సైట్ లో లాగిన్ చేయాలి. లేదా స్మార్ట్ఫోన్ లో డిజిలాకర్ యాప్ ఓపెన్ చేయాలి. అనంతరం 6 అంకెల సెక్యూరిటీ పిన్ తో పాటు ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ను ఎంటర్ చేసి సైన్-ఇన్ చేయాలి.
Read Also: CM Jagan : ఐటీసీ స్పైస్ ప్లాంట్ – వండర్‌పుల్ మూవ్‌మెంట్
ఆ తర్వాత మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు వాట్సాప్ ద్వారా డిజి లాకర్ ను యాక్సెస్ చేయవచ్చు. దీని కోసం ముందుగా MyGov వాట్సాప్ నంబర్ 9013151515 కి Hai అని మెసేజ్ చేయాలి. అనంతరం డిజిలాకర్ సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేసి, తదుపరి కనిపించే సూచనలను పాటించాలి. ఇలా అన్ని డాక్యుమెంట్స్ ను చూడవచ్చు, యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే ఈ యాప్ సేవలు వినియోగించుకున్న పెన్షనర్లు యాప్ ను అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ డిజీలాకర్ లో పౌరులు తమ హెల్త్ రిపోర్ట్ లను కూడా భద్రంగా దాచుకోవడమే కాకుండా, వాటిని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ తో లింక్ చేసుకోవచ్చని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ఏ) ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేసే విభాగమే నేషనల్ హెల్త్ అథారిటీ. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను డిజీలాకర్ తో రెండో అంచె అనుసంధానాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టు ఎన్ హెచ్ఏ ప్రకటించింది.