Telangana Govt: పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు.. టీచర్ల సర్దుబాటుపై కలెక్టర్లకు పూర్తి అధికారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన పాఠశాలలకు ఉపాధ్యాయుల కేటాయింపు, మిగులు (సర్ప్లస్) ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జిల్లాల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి, పాఠశాలల వారీగా మరియు సబ్జెక్టుల వారీగా అవసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను చేపట్టే పూర్తి అధికారాలను ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 22న ‘వర్క్ అడ్జస్ట్మెంట్’ (పని సర్దుబాటు) కింద అవసరమైన పాఠశాలలకు డెప్యుటేషన్‌పై పంపిన ఉపాధ్యాయులను ప్రస్తుతానికి రిలీవ్ చేయవద్దని జిల్లా విద్యాశాఖాధికారులకు (DEOs) విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సదరు డెప్యుటేషన్ పాఠశాలలో ఆయా సబ్జెక్ట్ టీచర్ల అవసరం ఉన్నంత కాలం వారు ప్రస్తుత పాఠశాలల్లోనే కొనసాగేలా చూడాలని మండల విద్యాధికారులు (MEOs), ప్రధానోపాధ్యాయులను (HMs) ఆదేశించింది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల పదవీ విరమణ (రిటైర్మెంట్), దీర్ఘకాలిక సెలవులు లేదా ఇతర కారణాల వల్ల ఖాళీలు ఏర్పడితే, విద్యార్థుల చదువులకు నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. జిల్లాల్లో పాఠశాలలు సజావుగా నడవడానికి వీలుగా, జిల్లా కలెక్టర్ ఆమోదంతో మిగులు ఉపాధ్యాయులను అవసరమైన చోట్లకు డెప్యుటేషన్‌పై పంపేందుకు డీఈఓలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ సర్దుబాటు ప్రక్రియ మొత్తాన్ని జూన్ 20, 2026 నాటి విద్యార్థుల ఎన్రోల్మెంట్ సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని, జీఓ నంబర్ 25 (GO 25) మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాలల వారీగా, సబ్జెక్టుల వారీగా విశ్లేషించి పూర్తి చేయాలని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
- Nepal Floods: నేపాల్‌లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
తాజావార్తలు
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!