NTV Telugu Site icon

Prajavani: ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుల వెల్లువ

Prajavani

Prajavani

Prajavani: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలతో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని, ప్రజాభవన్ అధికారులను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు.

అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 దరఖాస్తులు నమోదయ్యాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 175, పంచాయతీ రాజ్, గ్రామిణాభివృద్ధి శాఖకు సంబందించి 60 దరఖాస్తులు, పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 54, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 51, హోం శాఖకు సంబందించి 38 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 374 అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య, ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించండంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Read Also: TG ICET Results 2024: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. పలు శాఖల్లో దాడుల చేశారు. ఇక ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన వినతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్‌ కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.