Site icon NTV Telugu

MLA’s Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ సర్కార్‌

Mla Purchase Case

Mla Purchase Case

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే.. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ సర్కార్‌ సుప్రీకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తు తెలంగాణ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ గతంలోనే తీర్పునిచ్చింది. అయితే.. దీనిపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ వేయగా సీబీఐకి బదిలీ చేయడం సమంజసమే నంటూ తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్ సవాల్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని సీనియర్ సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే కోరారు.

Also Read : Superstition: తల్లిదండ్రులా.. రాక్షసులా.. 3 నెలల పసిపాపను కాల్చడానికి మనసేలా వచ్చిందిరా

అయితే.. ఈ కేసులో సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వంసమవుతాయని తెలంగాణ ప్రభుత్వం తరుఫు లాయర్‌ సుప్రీంకు విన్నవించారు. దీనిపై సీజేఐ స్పందింస్తూ.. పిటిషన్ ను రేపు ధర్మాసనం దృష్టికి తీసుకు రావాలని దుష్యంత్ దవేను సూచించారు. పిటిషన్‌ను రేపు ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే దాన్ని వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని వెల్లడించారు సీజేఐ. రేపు మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందని సీజేఐ పేర్కొన్నారు.

Also Read : TS Common Entrance Test : విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

Exit mobile version