NTV Telugu Site icon

Telangana Budget: త్వరలోనే రూ. 500లకే గ్యాస్ సిలిండర్.. 200 వరకు ఉచిత విద్యుత్..

Cong

Cong

తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రూ. 2,75,891కోట్లు లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ ను కాంగ్రెస్ సర్కార్ రూపొందించింది. ఈ బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో రెండు పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది.

Read Also: MLA KP Nagarjuna Reddy: మార్కాపురం ప్రజల రుణాన్ని తీర్చుకోలేను.. గిద్దలూరులో పోటీకి రెడీ

అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించినట్లు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌పై డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని అర్హులైన అందరికి ‘గృహజ్యోతి’ పథకం కింద 200 యూనిట్ల విద్యు్త్‌ను ఉచితంగా అందజేసేందుకు ఇప్పటికే మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ పథకానికి బడ్జెట్ లో రూ. 2,418 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ట్రాన్స్ కో, డిస్కమ్ లకు ఈ బడ్జెట్ లో 16వేల 825 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు శాసన సభలో భట్టి విక్రమార్క ప్రకటించారు.

Read Also: Telangana Budget 2024: త్వరలో మెగా డీఎస్సీ.. 15000 మంది కానిస్టేబుళ్లకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు

ఇక, బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇక, వాటి అమలు కోసం 53 వేల 196 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో భాగంగానే అర్హులైన లబ్దిదారులు అందరికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించేందుకు రెడీ అయినట్లు డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే ఈ హామీకి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఇక, అలాగే, మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి ప్రభుత్వం నెలకు 300 కోట్ల రూపాయలను చెల్లిస్తోందని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Show comments