Telangana: తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్.. ఉత్తర్వులు జారీ

Eturunagaram

Eturunagaram

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కార్ నేడు (శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు మండలాలతో కలిపి కొత్త రెవెన్యూ డివిజన్‌ని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు ములుగు రెవెన్యూ డివిజన్‌లో ఏటూరు నాగారం మండలం కొనసాగగా.. స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశారు.

Read Also: Crime News : కన్నతండ్రే కాటేశాడు.. ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారం

ములుగు డివిజన్‌లో గోవిందరావుపేట, వెంకటాపూర్‌, ములుగు మండలాలతో పాటు నూతనంగా ఏర్పాటయ్యే మల్లంపల్లి మండలం ఉండనున్నాయి. ములుగు మండలంలో అంతర్భాగంగా ఉన్న మల్లంపల్లి గ్రామాన్ని.. మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నాట్లు.. ప్రైమరీ నోటిఫికేషన్ కూడా తెలంగాణ సర్కార్ జారీ చేసింది. అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక మండలంగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది.